: కిరణ్ రాజీనామా చేయాల్సిందే: రెడ్యా నాయక్
పచ్చి సీమాంధ్రవాదిగా వ్యవహరిస్తున్న సీఎం కిరణ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి రెడ్యా నాయక్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ రోజు వరంగల్ జిల్లా కురివి మండల కేంద్రంలో జరిగిన సాధువుల సంఘం సమావేశంలో ఆయన ప్రసంగించారు. దోపిడీకి పాల్పడ్డ సీమాంధ్రులు కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.