: బాపట్లలో సూపర్ ఫాస్ట్ రైళ్ళకు హాల్టింగ్
ప్రయాణికులు విజ్ఞప్తికి రైల్వే అధికారులు స్పందించారు. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో యశ్వంత్ పూర్-హౌరా, చెన్నై-అహ్మదాబాద్ నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ళకు హాల్టింగ్ సౌకర్యం కల్పిస్తూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. ఈ రెండు రైళ్ళను బాపట్లలో ఆపాలని ప్రయాణికులు గత పదేళ్ళ నుంచి కోరుతుండగా, అధికారులు ఇన్నాళ్ళకు స్పందించారు. దీంతో, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.