: జగన్ తో చర్చించి గుడ్ బై చెబుతానంటున్న కాంగ్రెస్ ఎంపీ
తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా స్పీకర్ మీరా కుమార్ ను కోరినట్టు అనకాపల్లి ఎంసీ సబ్బం హరి తెలిపారు. రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపు తన రాజీనామాను ఆమోదిస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. మరో రెండు రోజుల్లో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను కలుస్తానని అన్నారు. ఆయనతో చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని సబ్బం హరి తెలిపారు.