: జగన్ పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను: మంత్రి ఆనం
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఛాంబర్ లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ, గతంలో తాను జగన్ పై 'ఆర్థిక తీవ్రవాది' అంటూ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. జగన్ బెయిలుకు కాంగ్రెస్ పార్టీ విధానాలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. 60 రోజులపాటు తెలంగాణ ప్రక్రియకు బ్రేక్ పడిందంటే కారణం తమ అభిప్రాయాలు తెలుసుకునేందుకేనని ఆయన అన్నారు. ఈ భేటీకి మంత్రి బొత్స, రఘువీరా, కొండ్రుమురళి, బాలరాజులు హాజరయ్యారు.