: కిరణ్ యాక్షనంతా అధిష్ఠానం డైరెక్షన్ లోనే జరిగింది: దాడి
సమైక్యాంధ్రకు మద్దతుగా సీఎం చేసిన వ్యాఖ్యలపై పొగడ్తలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. నిన్న కిరణ్ ప్రదర్శించిన ఆవేశమంతా అధిష్ఠానం కనుసన్నల్లోనే సాగిందని వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. సమైక్య రాష్ట్రంపై కిరణ్ కు నిజంగా ప్రేమ ఉంటే అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్టయితే ఎంపీల రాజీనామాలను ఎందుకు అడ్డుకుంటున్నారని? సీఎంను దాడి ప్రశ్నించారు.