: ఆంధ్రలో ముఖ్యమంత్రి హీరో కాదు జీరో అవుతారు: వీహెచ్
అధిష్ఠానం మాటకి కట్టుబడి ఉంటానన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు మాట మార్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వెనక ముఖ్యమంత్రి ఉండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రలో ముఖ్యమంత్రి హీరో కాదని జీరో అవుతాడని ఆయన ధ్వజమెత్తారు.