: విభజన అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలి: ఐటీ ఉద్యోగుల జేఏసీ
రాష్ట్ర విభజన అంశాన్ని చర్చల ద్వారా వెంటనే పరిష్కరించాలని ఐటీ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. హైదరాబాదులోని మాదాపూర్ లో ఐటీ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్ర విభజన, ఐటీ ఉద్యోగుల వలసలు, మౌలిక సదుపాయాలు, నిరుద్యోగం వంటి వాటిపై సమావేశంలో చర్చ జరిగిందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. రాజకీయ అనిశ్చితి తొలగించి ఐటీ పరిశ్రమ పురోగతికి నాయకులు, ప్రజలు సహకరించాలని వారు కోరారు.