: రాజీనామాలు ఆగస్టు 2నే చేశాం.. నేడు మరోసారి చేశాం: లగడపాటి


గతంలో చేసిన రాజీనామాలకు స్పందన లేకపోవడంతో మరోసారి రాజీనామా లేఖలు ఇస్తున్నామని స్పీకర్ కు తెలిపినట్టు ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. రాజీనామా చేసిన ఆనంతరం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తమపై ఏ ఒత్తిడి లేదని, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నామని తెలిపారు. 'ఎంపీలు రాజీనామాలు చేయండి.. శాసనసభ్యులు మాత్రం రాజీనామా చేయకండి' అని ప్రజలు కోరుతున్నారని, అసెంబ్లీలో తీర్మానాన్ని వారు ఓడించాల్సి ఉందని తెలిపారు.

'ప్రజలు కోరినదే మేం చేశాం' అని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు నలుగురమే అందుబాటులో ఉండడంతో తాము మాత్రమే రాజీనామాలు చేశామని, మిగిలిన వారు కూడా రాజీనామాలు చేసి వస్తారని అన్నారు. రాజీనామా లెక్కలు సాయంత్రానికి తేలతాయని స్పష్టం చేశారు.

రాష్ట్రం సమైక్యంగా వుండాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలో తప్పులేదనీ, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యాఖ్యానించారని.. కిరణ్ కుమార్ రెడ్డిని సమర్ధించారు. విభజనకు సాధ్యంకాని లింకులు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రిగా అభిప్రాయం వెలిబుచ్చారని, అది తప్పెలా అవుతుందని అన్నారు. అవగాహన లేకుండా చాలామంది మాట్లాడతారని అన్నారు. ఉద్యోగ బాధ్యతలు, వృత్తులు, పనులు వదిలేసి ఉద్యమం చేస్తున్న ప్రజలు రాజీనామాలు కోరుతుంటే 'మేము చేయము' అని అనలేమని తెలిపారు. ప్రజల కోరికమేరకు తాము రాజీనామా చేశామని అన్నారు.

  • Loading...

More Telugu News