: మేఘాలయలో మళ్లీ కాంగ్రెస్ కే పట్టం
మేఘాలయ ఎన్నికల్లో ఓటర్లు మళ్లీ అధికార కాంగ్రెస్ కే పట్టం కట్టారు. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ 29 సీట్లు గెల్చుకుంది. అయితే స్పష్టమైన మెజారిటీకి రెండు సీట్లు తక్కువయ్యాయి. కాగా, పాత కాపు పీఏ సంగ్మా పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీకి కేవలం రెండే సీట్లు దక్కాయి.