: కిరణ్ పై ఎర్రబెల్లి ధ్వజం


సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. నిన్న రాత్రి సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. హైదరాబాదు టీడీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎర్రబెల్లి.. కిరణ్ పై నిప్పులు చెరిగారు. సీఎం పదవిలో ఉంటూ కిరణ్ అన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓవైపు రాష్ట్రం నాశనమవుతున్నా, రెండు ప్రాంతాల వారినీ రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చి విభజన నిర్ణయాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News