: అన్ని పార్టీలను బహిష్కరించాలి: మోహన్ రెడ్డి
రాష్ట్రంలో సీపీఎం తప్ప అన్ని పార్టీలను బహిష్కరించాలని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ సీవీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాదు మెహదీపట్నంలోని అశోకాగార్డెన్స్ లో సీమాంధ్ర న్యాయవాదుల సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయ నేతల తీరువల్లే సీమాంధ్రలో ప్రజాఉద్యమం ఉద్ధృతంగా సాగుతోందని తెలిపారు. ఈ సదస్సుకు సీమాంధ్రలోని అన్ని జిల్లాల నుంచి న్యాయవాదులు భారీగా తరలివచ్చారు.