: ముఖ్యమంత్రితో బొత్స భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. బొత్సతో పాటు మంత్రులు దానం నాగేందర్, అహ్మదుల్లా, జేసీ దివాకర్ రెడ్డి, కొండ్రు మురళీ.. కిరణ్ ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నిన్న మీడియా సమావేశం పెట్టిమరీ సీఎం ఎలుగెత్తిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసే యోచనలో బొత్స ఉన్నట్లు వార్తలు వచ్చాయి. నిన్న సాయంత్రం ఆయన గవర్నర్ ను కూడా కలవడంతో ఈ విషయమై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సీఎం, పీసీసీ చీఫ్ ఒక్కటయ్యారంటూ వస్తున్న ప్రచారానికి బలం చేకూరుస్తూ వీరిద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.