: చిత్తూరు జిల్లా మదనపల్లిలో మేనకాగాంధీ పర్యటన
మాజీ ఎంపీ మేనకాగాంధీ చిత్తూరు జిల్లా మదనపల్లిలో పర్యటించారు. అక్కడి సత్సంగ్ విద్యాలయాలను సందర్శించారు. ఇది తన వ్యక్తిగత పర్యటన అని మేనక తెలిపారు. ఈ సందర్భంగా మేనకను కలిసిన చిత్తూరు జిల్లా సమైక్య జేఏసీ నాయకులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మద్దతివ్వాలంటూ వినతిపత్రాన్ని అందజేశారు.