: పెరోల్ పై బయటికొచ్చిన సంజయ్ దత్


బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు పది రోజుల పెరోల్ లభించింది. ఈ విషయాన్ని పుణేలోని యరవాడ జైలు అధికారులు తెలిపారు. కాలికి వెంటనే చికిత్స చేయించుకోవాల్సి ఉండటంవల్లే సంజయ్ కు అనుమతిచ్చినట్లు చెప్పారు. దాంతో, నిన్ననే ఆయన వెళ్లినట్లు స్పష్టం చేశారు. నాలుగు నెలలపైగా భార్య, పిల్లలకు దూరంగా ఉన్న సంజయ్ ఈ పది రోజులు వారితో గడపనున్నారు. ఇదే సమయంలో సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు కూడా సంజయ్ ను కలవనున్నారు.

  • Loading...

More Telugu News