: పాలమూరు ప్రజాగర్జన నేడే... హాజరుకానున్న సుష్మాస్వరాజ్


మన రాష్ట్రంలో సీట్ల సంఖ్యను పెంచుకోవడానికి బీజేపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు (శనివారం) మహబూబ్ నగర్ లో 'ప్రజాగర్జన' పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే ఈ సభకు బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ హాజరుకానున్నారు. తెలంగాణకు అనుకూలంగా పార్లమెంట్ లో మాట్లాడుతున్న సుష్మ ఈ సభకు హాజరవుతుండటంతో... బీజేపీ శ్రేణులు ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీనికి తోడు హైదరాబాద్ లో మోడీ హాజరైన 'నవభారత యువభేరి' సభ తర్వాత బీజేపీ నిర్వహిస్తున్న భారీ సభ ఇదే.

మహబూబ్ నగర్ లో బీజేపీకి మంచి పట్టు ఉండటంతో ఈ సభను విజయవంతం చేయడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఐకాస ఛైర్మన్ కోదండరాం కూడా ఈ సభకు హాజరుకావచ్చని సమాచారం. సభ అనంతరం సుష్మాస్వరాజ్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ తెలంగాణ నేతలతో సమావేశమవుతారు.

  • Loading...

More Telugu News