: స్పీడు పెంచే కొత్త చిప్‌


ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆప్టికల్‌ వ్యవస్థలను మరింత వేగంగా పనిచేయించగల సరికొత్త చిప్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ చిప్‌ అత్యున్నతమైన లేజర్ల తయారీలో చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ద్వారా హైస్పీడ్‌ కమ్యూనికేషన్లు, నావిగేషన్‌, రిమోట్‌ సెన్సింగ్‌ వంటి రంగాల్లో మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కెర్రీ వాహల అనే శాస్త్రవేత్త నేతృత్వంలో అమెరికా శాస్త్రవేత్తల బృందం ఒక సరికొత్త చిప్‌ను తయారుచేశారు. ఈ చిప్‌తో హైస్పీడ్‌ కమ్యూనికేషన్లు, నావిగేషన్‌, రిమోట్‌ సెన్సింగ్‌ వంటి రంగాల్లో మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని కెర్రీ వాహల చెబుతున్నారు. ధ్వని నుండి పుట్టే శక్తిని నియంత్రించే తులాదండాన్ని ఆదర్శంగా తీసుకుని శాస్త్రవేత్తలు సిలికా గ్లాస్‌ చిప్‌తో ఒక ఆప్టికల్‌ రెజోనేటర్‌ను తయారుచేశారు. కాంతి పౌన:పున్యాన్ని స్థిరీకరించే విధంగా దీనికి రూపకల్పన చేశారు. కాంతికణాలైన ఫోటాన్లు ప్రయాణించే మార్గాన్ని వీలైనంతగా పొడిగించడం ద్వారా ఈ కొత్తరకం చిప్‌ను తయారుచేయడం సాధ్యమయింది. దీనివల్ల శక్తిలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండవని, ఫలితంగా రెజోనేటర్‌ నాణ్యత గణనీయంగా పెరుగుతుందని కెర్రీ తెలిపారు. ఈ చిప్‌ను ఉపయోగించినప్పుడు ఎలక్ట్రానిక్‌, ఆప్టికల్‌ పరికరాల సామర్ధ్యం మరింతగా పెరుగుతుందని కెర్రీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News