: పుట్టినబిడ్డలకు తీపి స్వాగతం


సాధారణంగా పుట్టిన బిడ్డలకు నాలుకపై తేనె రాస్తుంటారు. దీనికి పలు కారణాలను చెబుతుంటారు. అయితే అప్పుడే పుట్టిన బిడ్డలకు రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉంటే వారి మెదడు దెబ్బతింటుందట. ఈ ప్రమాదం నుండి కాపాడేందుకు షుగర్‌ జెల్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ జెల్‌తో నవజాత శిశువులను మెదడు దెబ్బతినకుండా కాపాడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

డెక్స్‌ట్రోజ్‌ జెల్‌గా పిలవబడే ఈ షుగర్‌ జెల్‌ను ఎక్కువగా మధుమేహంతో బాధపడేవారు వాడుతుంటారు. ఈ జెల్‌ నవజాత శిశువుల విషయంలో కూడా చాలా చక్కగా ఉపకరిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుట్టగానే రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉండడాన్ని నియోనేటల్‌ హైపోగ్లైసీమియా అంటారు. ఈ లోపం వల్ల పుట్టిన శిశువుల మెదడు దెబ్బతింటుంది. ఈ ప్రమాదం నుండి కాపాడే షుగర్‌ జెల్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. పిల్లల్లోని ఈ లోపాన్ని అధిగమించడానికి తాము జరిపిన పరిశోధనల ఫలితమే ఈ జెల్‌ తయారీగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జెల్‌ను నవజాత శిశువుల నోటిలోపల బుగ్గల వెంబడి రాస్తే చాలు, వారి మెదడు దెబ్బతినే ప్రమాదంనుండి బయటపడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News