: మీ పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలంటే...
మీ పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలని మీరు కోరుకుంటే చక్కగా మీ పిల్లలకు రోజూ గుడ్లను ఆహారంలో భాగంగా పెట్టండి. దీంతో చక్కగా మీ పిల్లల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. సాధారణంగా పిల్లలకు రోజూ పాలు ఇస్తుంటాం. అలాగే రోజువారీ ఆహారంలో భాగంగా గుడ్డును కూడా చేర్చుకుంటే పిల్లల ఎదుగుదలకు చక్కగా ఉపకరిస్తుందట. కోడిగుడ్డులో ఉండే కొలీన్ అనే ప్రత్యేక విటమిన్ జ్ఞాపకశక్తి మెరుగుదలకు చక్కగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచే కణాలను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఈ కణాలు ఎంతగా పెరిగితే అంతగా జ్ఞాపకశక్తి వృద్ధి అవుతుంది. అలాగే ఇందులో విటమిన్- డితోబాటు ఒమెగా త్రీ పోషకాలు కూడా ఉంటాయి. ఈ పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తి తగ్గకుండా చూస్తాయి.
వెన్నలేని పాలలో మాంసకృత్తులు, విటమిన్ డి, పాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయట. ఇవి కూడా మెదడు పనితీరును మెరుగుపడేలా చేస్తాయట. అలాగే నాడీ వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండడంతోబాటు జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండాలంటే మీ పిల్లలకు రోజూ నట్స్ని తినిపించండి. అలాగే వంటకాల్లో పసుపును కూడా తగినంతగా వాడండి. ఎందుకంటే మెదడు ఎదుగుదలలో పసుపు పాత్ర కూడా కీలకమేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే సర్కుమిన్ అనే పదార్ధం మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుందని, దీని ఫలితంగా మతిమరుపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.