: బంగ్లాదేశ్ అల్లర్లలో 21 మంది మృతి


యుద్ధ నేరాల కేసులో జమాతే-ఈ-ఇస్లామిక్ పార్టీ ఉపాధ్యక్షుడు దెల్వర్ హుస్సేన్ సయీద్ కు మరణశిక్ష విధించడంతో బంగ్లాదేశ్ లో  అల్లర్లు చెలరేగి 21 మంది మరణించారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన సందర్భంగా చోటు చేసుకున్న వివిధ ఘటనల్లో దెల్వర్ హుస్సేన్ నిందితుడు.

అతనికి మరణ శిక్ష విధిస్తున్నట్టు ఈ రోజు బంగ్లా కోర్టు వెల్లడించడంతో దేశ వ్యాప్తంగా ఇస్లామిక్ వాదులు హింసకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 17 మంది పోలీసు కాల్పుల్లో చనిపోగా, మరో నలుగురు వేర్వేరు సంఘటనల్లో మరణించారు. 

  • Loading...

More Telugu News