: హెచ్‌ఐవీని నిర్మూలించవచ్చు!


సమూలంగా నిర్మూలించేందుకు మందు తెలియని వ్యాధి హెచ్‌ఐవీ. ఈ వ్యాధిని నిర్మూలించేందుకు తగు ఔషధాన్ని తయారుచేయడానికి శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హెచ్‌ఐవీని నిర్మూలించే ఒక ఔషధాన్ని తయరుచేసే దిశగా శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాల్లో కొంత పురోగతి కనిపించింది. ఈ వ్యాధిని కూడా నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది కూడా వేరే ఒక వ్యాధికి వాడే మందు హెచ్‌ఐవీ వ్యాధిని తిరిగి రాకుండా తొలగించగలదని శాస్త్రవేత్తల ప్రయోగాల్లో తేలింది. దీంతో ఈ వ్యాధిని నిర్మూలించడానికి ఈ మందును మరింత సమర్ధవంతంగా తయారుచేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

యాంటీ ఫంగల్‌ క్రీములను ఉపయోగించి హ్యూమన్‌ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్‌ (హెచ్‌ఐవీ)ని సమూలంగా నాశనం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ని నిర్మూలించడానికి సాధారణంగా సైక్లోపిరాక్స్‌ అనే మందును వాడతారు. ఈ మందు హెచ్‌ఐవీని శరీరంనుండి తిరిగి రాకుండా తొలగించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రూట్జర్‌ న్యూజెర్సీ వైద్య కళాశాలల పరిశోధకులు మైఖేల్‌ మాథ్యూస్‌, హార్ట్‌మట్‌ హనౌస్కేల నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్లోస్‌వన్‌ పత్రికలో ప్రచురితమయ్యాయి.

కాలివేళ్లు, గోళ్లలో ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకినప్పుడు సాధారణంగా సైక్లోపిరాక్స్‌ క్రీమును ఉపయోగిస్తుంటారు. ఇదే మందును హెచ్‌ఐవీ వ్యాధి బాధితుల్లో ఉపయోగించినప్పుడు అది శరీరంలోని హెచ్‌ఐవీ బాధిత కణాలపై దాడిచేస్తుంది. కణాల అంతర్భాగ వ్యవస్ధను దెబ్బతీస్తుంది. సాధారణంగా కణాల్లో అంతర్భాగమైన మైటోకాండ్రియా కణాలకు శక్తినిచ్చే సాధనంగా పనిచేస్తుంది. అయితే ఈ యాంటీ ఫంగల్‌ మందును వాడడం వల్ల హెచ్‌ఐవీ రోగుల్లో మైటోకాండ్రియా పనితీరు దెబ్బతింటుంది. దీంతో కణాలకు అందాల్సిన శక్తి అందకపోవడంతో హెచ్‌ఐవీ కణాలు నాశనం అవుతాయనే ఈ పరిశోధనల్లో తేలింది. ఈ మందును ఆపేసిన తర్వాత వైరస్‌ తిరిగి శరీరంలోకి ప్రవేశించలేదని, ప్రయోగకాలంలో వైరస్‌ సోకని కణాలకు ఎలాంటి హాని కలగలేదని ఈ పరిశోధనలో తేలినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News