: ముఖ్యమంత్రి తక్షణం క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయాలి: హరీష్ రావు


ముఖ్యమంత్రి మరోసారి తాను సీమాంధ్ర పక్షపాతినని నిరూపించుకున్నారని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. ఆయన తక్షణం క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సీమాంధ్ర ప్రజలకే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. అవగాహన లేని ముఖ్యమంత్రి ప్రక్కన ఎలా కూర్చుంటున్నారని ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కిరణ్ 13 జిల్లాలకు ముఖ్యమంత్రని మరోసారి తేటతెల్లమైందని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజలు కన్పించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News