: సాగు, త్రాగు నీటీ ఇబ్బందులను పరిష్కరించాలి: ముఖ్యమంత్రి


నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1963లో నెహ్రూ ఫౌండేషన్ వేస్తే, 1982లో ఇందిర ప్రారంభించారని ముఖ్యమంత్రి అన్నారు. 80 వేల ఎకరాలు ముంపుకు గురయ్యాయని గుర్తు చేశారు. పులిచింతల ప్రాజెక్టుకు 28 వేల ఎకరాలు సబ్ మెర్జ్ అయ్యాయని తెలిపారు. అయితే తాము రైతులను ఒప్పించి పులి చింతల ప్రాజెక్టు పూర్తి చేశామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని గ్రామాలను తరలించామని, అయినప్పటికీ ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాలతో ఇబ్బందులున్నాయని, అయినప్పటికీ వారిని ఒప్పిస్తున్నామని వెల్లడించారు. ఈ రోజు లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయంటే కారణం ఆంధ్రప్రదేశ్ అవతరణే అని స్పష్టం చేశారు.

వ్యవయసాయ రంగంలో ఇబ్బందులొస్తే ఆహారలోటు ఏర్పడుతుందని అన్నారు. కర్ణాటక నుంచి మహబూబ్ నగర్ మీదుగా 82 కిలో మీటర్లు దాటిన తరువాత శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు వస్తుందని, దాని ద్వారా 8 జిల్లాల్లో మొత్తం 82 వేల ఎకరాలు సాగులో ఉన్నాయని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుకు నీటీ కేటాయింపు 99.7 టీఎంసీలని తెలిపారు. అయితే మనం వాడుతున్నది 327 టీఎంసీలు మాత్రమేనని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 44లక్షల ఏడు వేల ఎకరాలకు నీరు అందుతుందని ఆయన తెలిపారు.

కృష్ణా ఒక్కటే 74 లక్షల 60 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తోందని ఆయన తెలిపారు. సీడబ్ల్యూసీ నీటి కేటాయింపులపై ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు కమిటీలన్నీ కేటాయించిన, నిల్వ ఉన్న నీటిపైన లెక్కలు వేశాయని, మరి వరద నీటి మీద లెక్కలు ఎలా వేస్తారని అయన అన్నారు. ఆల్మట్టి డాం ఎత్తు పెంచిన తరువాత మనకున్న కేటాయింపుల ప్రకారం 800 టీఎంసీలు వాడాలి. కానీ, మనం వెయ్యికి పైగా టీఎంసీలు వాడుతున్నాం. ఐఐటీ టీం వచ్చి స్టడీ చేసి, 300 టీఎంసీల నీరు నష్టపోతోందని తెలిపిందని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ లో జూన్ లో నీరు నిల్వచేయగలిగితే 170 టీఎంసీల నీరు కలిసి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. పోలవరం అభివృద్ది చేయగలిగితే 300 టీఎంసీల నిల్వ ఉంటాయి. 75 శాతం నీటిని రాయలసీమ, తెలంగాణలకు సాగు, త్రాగు నీరు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News