: నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినే.. సమైక్యాన్ని కోరుతున్నాను: కిరణ్ కుమార్ రెడ్డి


'యస్... అయాం ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్..' ఇదీ కిరణ్ కుమార్ రెడ్డి నొక్కి చెప్పిన మాట. భవిష్యత్ తరాలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. 'రాజకీయ నిర్ణయం జరిగింది. సమస్యలను పరిష్కరించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంద'ని అయన స్పష్టం చేశారు. 'నేను ముఖ్యమంత్రిగా ఉండగా తప్పు జరగకూడదు అన్నదే నా ప్రధానఉద్ధేశ్యమని' స్పష్టం చేశారు. గత 56 రోజులుగా రాజకీయ పార్టీలను దగ్గరకు రానివ్వకుండా ఆరున్నర లక్షల మంది ఉద్యోగులు ప్రజలతో కలిసి ఉద్యమిస్తున్నారని గుర్తు చేశారు. 'నేను శాశ్వత ముఖ్యమంత్రిని కాదు, దిగ్విజయ్ సింగ్ శాశ్వత ఇన్ఛార్జి కాదు. రాష్ట్రం, రాష్ట్రప్రజలు శాశ్వతం. కేంద్రం ప్రభుత్వం ముందుకు రావాలి' అని స్పష్టం చేశారు. 'దిగ్విజయ్ సింగ్ చెప్పినట్టు నేను సమైక్యవాదినే' అని అన్నారు. 'నా తల్లిదండ్రుల దగ్గర్నుంచి సమైక్యవాదులమే' అని చెప్పారు. 'మీరు నన్ను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి అన్న ప్రతిసారీ సమైక్యత కోసం ఎంత బలంగా కృషి చేయాలో నాకు గుర్తు చేస్తున్నార'ని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News