: సాగునీటి విభజన ఎలా జరుగుతుంది.. సాధ్యమేనా?: ముఖ్యమంత్రి


విభజన జరిగితే సాగు, త్రాగు నీటి నష్టం గురించి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే సీడబ్ల్యూసీలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. 1956కి ముందు ఫజుల్ ఆలీ కమిటీ రాష్ట్రం కలిసుండాలని చెప్పడానికి కారణం, నీటి సమస్యే! గోదావరి, కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే కలిసుండాలని ఆ కమిటీ సూచించింది. గోదావరి, కృష్ణా నదుల్లో నీటి వినియోగం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు జరగాలంటే, రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండాలని అన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1955లో పునాది వేస్తే, 1967 ఇందిరాగాంధీ దానిని ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ రోజే రాష్ట్రం విడిపోయి ఉంటే ఈ ప్రాజెక్టు కట్టగలిగేవారా? అని ప్రశ్నిచారు. అప్పట్లో 4,500 కుటుంబాలను తరలించారని ముఖ్యమంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News