: ఆర్డినెన్స్ పై మాట్లాడే ముందు రాహుల్ నాకు చెప్పారు: ప్రధాని
దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించేందుకు యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడానికి ప్రయత్నించడంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందిస్తూ.. ఆర్డినెన్స్ విషయంలో ప్రకటన చేసే ముందు రాహుల్ తనకు లేఖ రాశారన్నారు. అమెరికా పర్యటన నుంచి వచ్చాక ఈ అంశంపై కేబినెట్ లో చర్చిస్తామన్నారు. ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ లేవనెత్తిన అంశాలను కేబినెట్ లో చర్చిస్తామని చెప్పిన ప్రధాని, దోషులైన ప్రజాప్రతినిధులను రక్షించే ఆర్డినెన్స్ పై తప్పకుండా ప్రజల్లో విస్తృత చర్చ జరగాలన్నారు.