: సిక్సర్ల సిద్దూ నిరవధిక నిరాహార దీక్ష రేపటినుంచి


మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ నవ్ జోత్ సింగ్ సిద్దూ రేపటి నుంచి అమృతసర్ లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. తన నియోజకవర్గం అమృతసర్ అభివృద్ధికి రావాల్సిన నిధులను మంజూరు చేయకపోవడానికి నిరసనగా ఆయన దీక్షకు కూర్చోనున్నారు. ప్రజా ప్రతినిధిగా చట్టసభకు ఎన్నికైన తనకు తన బాధ్యతలు తెలుసని, తన బాధ్యతను తాను నిజాయతీగా నిర్వర్తిస్తానన్నారు. తానెవరికీ వ్యతిరేకం కాదని, తానెవర్నీ విమర్శించనని చెప్పిన ఆయన, సమస్య పరిష్కారానికి నిరాహార దీక్షే మార్గంగా ఎంచుకున్నానని అన్నారు. గతంలో సిద్దూ కనిపించడం లేదని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రమాణాలను నెరవేర్చలేదని సిద్దూపై స్థానికులు గోడపత్రికలు అంటించారు.

  • Loading...

More Telugu News