: బెయిలు కోసం సోనియా కాళ్లు పట్టుకున్నారు: సీఎం రమేష్


వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణి భారతి ఢిల్లీ వచ్చి అహ్మద్ పటేల్ ను ఎన్నిసార్లు కలిశారో తనవద్ద అధారాలు ఉన్నాయని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో విజయమ్మ దిగగానే మేకపాటితో కలిసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లారన్నారు. రాహుల్ తో మాట్లాడిన తరువాతే ఉద్యోగుల ఆందోళన శిబిరం వద్దకు వెళ్లారన్నారు.

బెయిల్ కోసం సోనియా కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇస్తామనగానే ఆ ప్రాంత నేతలను వైఎస్సార్ సీపీ నట్టేట ముంచిందని అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. సమైక్యాంధ్ర పేరిట తాము పార్లమెంటులో పోరాటం చేస్తున్నప్పుడు ఆ పార్టీ ఎంపీలు మేకపాటి, సబ్బం హరిలు ఏమయ్యారని రమేష్ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News