: భారత్-ఏ ఎదురీత
విండీస్-ఏ తో జరుగుతున్న అనధికార తొలి టెస్టులో భారత్-ఏ కష్టాల్లో పడింది. 124/3 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్-ఏ జట్టు 245 పరుగులకు అలౌటైంది. భారత బ్యాట్స్ మెన్ లో జునేజా(84) మినహా మరే ఆటగాడూ రాణించలేదు. దీంతో భారత జట్టు కేవలం 121 పరుగులు జోడించి చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. విండీస్ బౌలర్లలో పెరుమాళ్(5), మిల్లర్(4) రాణించారు. కాగా, తొలి ఇన్నింగ్స్ లో విండీస్ 429 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రాంరంభించిన విండీస్ మూడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. దీంతో ఒవరాల్ గా విండీస్ కు 314 పరుగుల ఆధిక్యం లభించింది.