: బాలీవుడ్ లో 'బిగ్గెస్ట్ బ్రాండ్ వాల్యూ' ఆయనదే!
బాలీవుడ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే అమితాబ్ బచ్చన్ ముందు, తర్వాత అని చెప్పుకోక తప్పదు. అంతగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తన పేరుకు ఎంతో విలువను పెంచుకుంటూపోయారు. యాంగ్రీ యంగ్ మాన్, బిగ్ బి, షెహన్ షా బిరుదులతో డెభ్బై సంవత్సరాల పైబడినా పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ తనదైన ముద్ర వేస్తూనే వున్నారు. అలా తన బ్రాండ్ విలువ పెంచుకుంటూపోతూ నవతరం నటులకు సైతం పోటీ ఇస్తున్నారు. దాంతో, ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యంత బ్రాండ్ వాల్యూ కలిగిన నటుడు అమితాబేనని ఓ సర్వేలో తేటతెల్లమైంది. 'స్క్రీన్ వార్షిక సర్వే'పేరుతో ప్రతిఏటా ఓ సర్వే జరుగుతుంది. ఇందులో పలువురు నటుల పాప్యులారీటి, బ్రాండ్ వాల్యూ ఎంతవరకు ఉందో తేలుస్తుంది. అలా ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో అమితాబ్ ప్రధమ స్థానాన నిలిచారు. టాలెంట్ లో 18శాతం, నైపుణ్యం 12శాతం, విజ్ఞానం 11శాతం, కష్టపడేతత్వం 8 శాతం, బహుముఖ ప్రజ్ఞ 6శాతం కలిగి ఉన్నారని సర్వేలో తేలింది. తర్వాత స్థానంలో షారుక్ ఖాన్ (14శాతం), రణబీర్ కపూర్ (8 శాతం) నిలిచారు.