: సుప్రీం నిర్ణయాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నా: మోడీ
సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ తెలిపారు. అహ్మదాబాద్ లో ఆయన మాట్లాడుతూ, దేశ రాజకీయాల మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుందని అన్నారు. ఎన్నికల సంస్కరణల్లో ఇది మంచి ముందడుగు అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పార్టీలు బాధ్యతతో వ్యవహరించేలా ఈ నిర్ణయం ప్రభావితం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్లకు ఈ అవకాశం కల్పించాలని తాను ఎంతో కాలంగా కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ విషయంపై నరేంద్ర మోడీ తన బ్లాగులో సవివరంగా ఒక వ్యాసం కూడా రాశారు.