: సోనియాపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు: వీహెచ్
ముఖ్యమంత్రి సహా సీమాంధ్ర నేతలు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు సోనియాపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లదని ఆయన అభిప్రాయపడ్డారు.