: ఆర్ బీఐ గవర్నర్ కు డచ్ బ్యాంక్ బహుమతి
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ కు 'డచ్ బ్యాంక్-2013 ప్రైజ్' లభించింది. 'ఫైనాన్షియల్ ఎకనమిక్స్'కు సంబంధించి రాజన్ ఓ పరిశోధన చేశారు. విశ్వవ్యాప్తంగా ఆర్ధిక విధానాలను ప్రభావితం చేయటంలో ఆయన పరిశోధన ఉపకరించిన నేపథ్యంలో ఈ గుర్తింపు లభించింది. ఇందుకుగాను 'డచ్ బ్యాంక్ డొనేషన్ ఫండ్' స్పాన్సర్ చేస్తున్న ఈ బహుమతి కింద 50వేల యూరోలు ఇవ్వనున్నారు. 37 దేశాల నుంచి ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, బ్యాంకుల నుంచి మొత్తం 260 నామినేషన్లు వచ్చాయి. వాటిలో రాజన్ ను ఎన్నుకోవడం విశేషం.