: రేపు స్పీకర్ ను కలవనున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు
రాష్ట్ర సమైక్యత కోసం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ వ్యతిరేకతను పెంచుతున్నారు. ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ను ఆరుగురు ఎంపీలు కలవనున్నారు. రాజీనామాలు ఆమోదించుకునేందుకు స్పీకర్ పై ఒత్తిడి తెస్తామని ఎంపీలు తెలిపారు. స్పీకర్ ను కలిసే వారిలో లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, రాయపాటి సాంబశివరావు, ఎస్పీవై రెడ్డి ఉన్నారు.