: ఎస్మాకు భయపడి సమ్మెపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు: అశోక్ బాబు
సమ్మె విషయంలో ప్రభుత్వం ప్రయోగించే ఎస్మాకు భయపడి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఏపీఎన్జీఒ అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగానే తమ ఉద్యమమన్నారు. రేపు కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి ఉంటుందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన బాధ్యత శాసనసభ్యుల పైనే ఉందన్న అశోక్ బాబు, విభజనకు సంబంధించిన తీర్మానానికి రాష్ట్ర శాసనసభ్యులు వ్యతిరేకంగా ఓటేయాలని హైదరాబాద్ మీడియా సమావేశంలో కోరారు. ఈ క్రమంలో విభజనను అడ్డుకోవాలని అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేఖ రాస్తామన్నారు. 29న కడపలో నిర్వహించే సభ రాష్ట్ర దశ, దిశను నిర్ణయించేదిగా ఉంటుందని, ఈ సభకు భారీగా ఉద్యోగులు రావాలని ఆయన పిలుపునిచ్చారు.