: ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐదు జిల్లాలు ఎడారిగా మారతాయి: కిషన్ రెడ్డి


బాబ్లీ ప్రాజెక్టు వివాదంలో రాష్ట్రం ఉదాసీనంగా వ్యవహరించబట్టే సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలిందని బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఐదు జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని అఖిల పక్షం ఏర్పాటు చేసి ఢిల్లీలో బలమైన గొంతుకు వినిపించాలని ఆయన సూచించారు. సుప్రీం కోర్డులో ప్రభుత్వం పదునైన వాదనలు వినిపించలేకపోయిందన్నారు. గోదావరి నదిపై మహారాష్ట్రలోని బాబ్లీ వద్ద ప్రాజెక్టు నిర్మించవచ్చని ఈ రోజు సుప్రీం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News