: రాజకీయ సంక్షోభం వస్తేనే సమస్యకు పరిష్కారం: విజయమ్మ
రాజకీయ సంక్షోభం వస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్పష్టం చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాకు మద్దతు పలికిన విజయమ్మ మాట్లాడుతూ, రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు గతంలో తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని కోరాలని ఉద్యోగులకు సూచించారు. ఆంటోనీ, చిదంబరం, మొయిలీ వారి రాష్ట్రాలను ఎందుకు విభజించడం లేదని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ పేరుతో ఎన్నికలకు వెళ్తామని లీకులు ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్దంగా తెలంగాణపై నిర్ణయం తీసుకుందని విజయమ్మ తెలిపారు.