: ఢిల్లీ విమానాశ్రయానికి అంతర్జాతీయ అవార్డు
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 'ఇంటర్నేషనల్ సేఫ్టీ అవార్డు' లభించింది. పరిశుభ్రత, భద్రతలను ప్రామాణికంగా తీసుకున్న బ్రిటీష్ భద్రత మండలి ఢిల్లీ విమానాశ్రయాన్ని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు ప్రకటించింది. దేశంలో ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి విమానాశ్రయం ఇదే కావడం విశేషం.