: సుప్రీం తీర్పును రాజకీయ పార్టీలు అంగీకరించవు: కేజే రావు
సుప్రీం కోర్టు తీర్పును రాజకీయ పార్టీలు అంగీకరించే అవకాశం లేదని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తిరస్కార ఓటుకు అవకాశం కల్పించాలని సుప్రీం కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించడం ప్రజాస్వామ్యానికి ఉపయోగకరమైన కీలక తీర్పు అన్నారు. సుప్రీం కోర్టు అదేశాలను అమలు చేయడం ఎన్నికల సంఘానికి పెద్ద కష్టమేమీ కాదన్నారు.