: సుప్రీం తీర్పు మంచిదే.. కానీ అద్భుతాలు జరగకపోవచ్చు: జేపీ
ఎన్నికల్లో తిరస్కార ఓటుకు అవకాశం కల్పించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తిరస్కార ఓటుకు అవకాశం కల్పించాలని గతంలోనే లోక్ సత్తా కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది కొంత మంచి పరిణామమే తప్ప, దీంతో పెద్దగా అద్భుతాలు జరుగుతాయని అనుకోవట్లేదని అన్నారు. తమకు నచ్చని అభ్యర్థులు లేరన్న వంకతో ఓటు వేయడం మానేసేవారు, సుప్రీం తీర్పుతో తిరస్కార ఓటు ద్వారా నిరసనను తెలిపే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న మార్పుకు ఈ తీర్పు నాంది అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.