: సొలిసిటర్ జనరల్ పదవికి నారీమన్ రాజీనామా
భారత సొలిసిటర్ జనరల్ పదవికి రోహింటన్ నారీమన్ ఆకస్మికంగా రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకు పంపారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనీ కుమార్ తో సరిపడకపోవడం వల్లే నారీమన్ రాజీనామా చేసారని సమాచారం. ఇందుకు గల కారణాలు తెలియాల్సి వుంది. గోపాల సుబ్రహ్మణ్యం నుంచి సొలిసిటర్ జనరల్ బాధ్యతలను నారీమన్ 2011 జులైలో చేపట్టారు. మరో రెండు సంవత్సరాల పదవీకాలం వుండగా అయన రాజీనామా చేయడం చర్చనీయాంశం అయింది.