: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ధర్నాలో వైఎస్ విజయమ్మ
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నిర్వహిస్తున్న మహాధర్నాలో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. ధర్నా కోసమే ఈ ఉదయం హస్తిన బయలుదేరి వెళ్లిన ఆమె కొంతసేపటి కిందటే అక్కడికి చేరుకున్నారు. వెంటనే ధర్నాకు హాజరై ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమైక్యరాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. రాష్ట్రంలో అనిశ్చితికి కారణం కాంగ్రెస్సేనని, వారి నిర్ణయంతోనే ప్రజలకు ఇబ్బందులు వచ్చాయని విజయమ్మ విమర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తెలిసే అన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు.