: 'వరల్డ్ హెరిటేజ్ సిటీ'గా వరంగల్ కు గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వరంగల్ ను 'వరల్డ్ హెరిటేజ్ సిటీ'గా పేర్కొంటూ యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, కల్చరల్ఆర్గనైజేషన్) సంస్థ గురువారం ప్రకటించింది. ఓరుగల్లు కోట, వేయి స్థంభాల గుడి, రామప్ప శిల్పకళా సౌందర్యం ఇవన్నీ కాకతీయుల కాలం పలు కట్టడాలు.
నేడు అవి పలువురిని ఆకర్షిస్తూ ఆ ప్రాంత కీర్తిని మరింత ఇనుమడింపజేస్తున్నాయి. ఎల్లలు దాటి నగర ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయాయి. ఇప్పుడు యునెస్కొ గుర్తింపు వరంగల్ కు పర్యాటకుల సంఖ్య మరింత పెరిగేందుకు దోహదపడనుంది. కాగా, వరంగల్ నగరాన్ని హెరిటేజ్ సిటీ గా ప్రకటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.