: తిరస్కార ఓటుకు అనుమతించండి: సుప్రీంకోర్టు ఆదేశం
ప్రజాప్రతినిథులకు చెక్ పెట్టే ఆదేశాలను సుప్రీం కోర్టు ఇచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో దేశ రాజకీయాల్లో సమూల మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని తిరస్కరించే హక్కు ఓటరుకు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్నికల్లో పోటీలో నిలబడిన అభ్యర్థిని తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందని, పార్లమెంటులో కూడా ఆ హక్కు ఉందని గుర్తుచేస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. తిరస్కార హక్కు వల్ల రాజకీయాల్లో పారదర్శకత పెరుగుతుందని సుప్రీం కోర్టు తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందర్నీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉందని తెలిపింది. ఎన్నికల సంఘం ఈ అవకాశం కల్పించడం వల్ల సంస్థాగతమైన మార్పులు వస్తాయని సుప్రీం కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది.