: పీసీ చాకోకు సీతారాం ఏచూరి అసమ్మతి లేఖ


ఈ రోజు జరగనున్న జేపీసీ భేటీకి వివిధ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2జీ కుంభకోణంపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ) ఈ రోజు సమావేశంకాబోతోంది. కుంభకోణానికి సంబంధించిన ముసాయిదా నివేదికపై ఈ కమిటీ చర్చించనుంది. ఈ నేపథ్యంలో సీపీఎం నేత సీతారాం ఏచూరి జేపీసీ అధ్యక్షుడు పీసీ చాకోకు అసమ్మతి లేఖ రాశారు. 2జీ కుంభకోణంలో ప్రధాని మన్మోహన్, ఆర్థికమంత్రి చిదంబరంను విచారించడంలో జేపీసీ విఫలమయిందని విమర్శించారు. ముసాయిదా నివేదికను తయారుచేసేటప్పుడు కనీసం కమిటీ సభ్యులను కూడా సంప్రదించలేదని ఆరోపించారు. 30 మంది సభ్యులు గల జేపీసీలో ఏచూరి కూడా ఒక సభ్యుడుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News