: ఢిల్లీ వెళ్లిన వైఎస్ విజయమ్మ
వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ రోజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో నేడు జంతర్ మంతర్ వద్ద సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తలపెట్టిన మహాధర్నాలో ఆమె పాల్గొననున్నారు. విజయమ్మతో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. సమైక్యాంధ్రకే వైఎస్సార్సీపీ మద్దతు తెలుపుతుండటంతో రెండు రోజుల కిందట సచివాలయ ఉద్యోగులు జగన్ ను కలిసి ధర్నాల్లో పాల్గొనాలని కోరిన సంగతి తెలిసిందే.