: 2జీ కుంభకోణంపై జేపీసీ భేటీ నేడే


ఎంతో సంచలనం సృష్టించిన 2జీ కుంభకోణంపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ) ఈ రోజు ఢిల్లీలో సమేవేశంకానుంది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ప్రధాని మన్మోహన్ కు క్లీన్ చిట్ ఇచ్చారు. మాజీ టెలికాం శాఖ మంత్రి ఏ.రాజాపై నేరం మోపుతూ జేపీసీ తన ముసాయిదా నివేదికలో పేర్కొంది. దీంతో ఈ భేటీలో రాజా అంశంపైనే ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రాజాను జేపీసీ ముందు హాజరుపరచాలంటూ యూపీఏ భాగస్వామి ఎన్సీపీ పట్టుబడుతూ ఉంది. దీంతో కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇదే డిమాండ్ ను బీజేపీ, డీఎంకే, జేడీయూ, వామపక్షాలు కూడా చేస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వాదనను విన్నప్పుడే... అందులో పేర్కొన్న విషయంపై నిజనిజాలు వెలుగుచూస్తాయని అభిప్రాయపడుతున్నాయి.

  • Loading...

More Telugu News