: ప్రమాదాల్లో ఉపకరించే రాడార్‌ సేవలు


భారీ ప్రమాదాలు, భూకంపాలు వంటివాటి వల్ల పెద్ద పెద్ద భవనాలు కూలిపోతుంటాయి. ఈ శిధిలాలకింద ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే కొందరు ప్రాణాలతో ఈ శిధిలాలకింద చిక్కుకున్నా, వారికి తక్షణ సహాయక చర్యలు అందని కారణంగా వారిలో కొందరు ప్రాణాలను కోల్పోతుంటారు. ఇలాంటి ప్రమాదంలో చిక్కుకున్నవారిని గుర్తించి, వారికి తక్షణ సహాయ చర్యలు అందించడానికి ఉపకరించేలా రాడార్‌ వ్యవస్థను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఒక సరికొత్త రాడార్‌ వ్యవస్థను అభివృద్ధి పరచింది. ఈ రాడార్‌ పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలిపోయిన సమయంలో శిధిలాలకింద చిక్కుకున్న వారిని గుర్తించి, వారికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ రాడార్‌ వ్యవస్థ పేరు ఫైండర్‌. ఇది శిధిలాలకింద దాదాపుగా 9 మీటర్ల దిగువన చిక్కుకున్న వారిని సైతం గుర్తిస్తుంది. మైక్రోవేవ్‌ రాడార్‌ సంకేతాలను పంపించడం ద్వారా ఇది పనిచేస్తుంది. శిధిలాలకింద చిక్కుకున్నవారి హృదయ స్పందన, శ్వాసక్రియ కదలికలను ఇది పసిగడుతుంది. సహాయక కార్యక్రమాలకు ఈ రాడార్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని నాసా చెబుతోంది.

  • Loading...

More Telugu News