: మార్చి 13 నుంచి శాసనసభ సమావేశాలు
మార్చి13 నుంచి 22 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని ఆర్ధికమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అయితే దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే గవర్నర్, ముఖ్యమంత్రి ముందు ఉంచామని చెప్పారు. ఒకవేళ సమావేశాల నిర్వహణ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే 18నే రాష్ట్ర శాసనసభ బడ్జెట్టు ప్రవేశపెడతామని మంత్రి హైదరాబాదులో వెల్లడించారు.
కాగా, మార్చి 22న సభ వాయిదాపడుతుంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 22 వరకు స్థాయి సంఘాల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది. మళ్లీ ఏప్రిల్ 23 నుంచి 8 రోజుల పాటు శాసనసభలో బడ్జెట్ పై చర్చ జరుగనుంది. మే 2న బడ్జెట్టు సభలో ఆమోదం పొందిన అనంతరం అదే రోజు శాసనసభ సమావేశాలు ముగుస్తాయని ఆనం వివరించారు.