: హైదరాబాద్‌లో ఇలాంటి వారు ఎక్కువట!


ఇప్పుడు ఎక్కడ చూసినా ఊబకాయం సమస్య అందరినీ వేధిస్తోంది. ఈ సమస్య వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఆటోమెటిక్‌గా వస్తాయి. అయితే ఈ సమస్య ఎక్కువగా హైదరాబాద్‌లో ఉండే యువతలో కనిపిస్తోందట. అసలు యువ ఉద్యోగుల్లోనే గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ప్రత్యేక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఒకచోటు నుండి కదలకుండా పనిచేయడం, పని ఒత్తిడి, సమయానికి తినకపోవడం, తినడం కూడా ఏది దొరికితే అదే తినేయడం, వ్యాయామం అస్సలు చేయకపోవడం... ఇలాంటి జీవనశైలి కారణంగా యువత గుండెజబ్బులకు లోనవుతున్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది.

మెరికో సంస్థలు దేశంలోని 12 ప్రధాన నగరాల్లో 'ది సఫోలా లైఫ్‌స్టడీ2013' పేరుతో సుమారు 1.86 లక్షలమందిపై అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో 30 నుండి 40 ఏళ్ల వయసున్న వ్యక్తుల్లో 73 శాతం మంది 35 నుండి 39 వయసున్న వ్యక్తుల్లో 76 శాతం మంది, 40 నుండి 44 వయసున్న వారిలో 85 శాతం మంది గుండె రక్తనాళాల జబ్బుల బారిన పడే ప్రమాదముందని తేలింది. ఇది పురుషుల్లోనే కాకుండా మహిళల్లో కూడా 30 నుండి 40 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి 60శాతం మందికి ఈ ముప్పు పొంచివుందని ఈ అధ్యయనంలో తేలింది.

మన ఆరోగ్యంపై నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలు, వేపుళ్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని, వాటిని తీసుకోకుండా వాటికి బదులుగా ఆకుకూరలు, పండ్లు, గింజధాన్యాలు వంటివాటిని తీసుకోవడం మంచిదని ఆహార, ఫిట్‌నెస్‌ నిపుణులు నితీ దేశాయ్‌ చెబుతున్నారు. ఈ ఊబకాయం సమస్య హైదరాబాద్‌లో ఎక్కువగా ఉందని, ఈ పరిశోధనలో పాల్గొన్నవారిలో 52 శాతం మంది ఊబకాయులు హైదరాబాద్‌లో ఉండగా, ఢిల్లీలో 54 శాతంమంది, చెన్నైలో 51 శాతం మంది ఉన్నారట. అలాగే మధుమేహ రోగులు చెన్నైలో 18 శాతం ఉండగా, హైదరాబాద్‌లో 17 శాతం మంది ఉన్నారని ఈ అధ్యయనం వెల్లడించింది. అలాగే నిల్వ చేసిన ఆహార పదార్ధాలను తినే వారు ఢిల్లీలోనే ఎక్కువశాతం మంది ఉన్నారట. ఢిల్లీ నగరంలోని దాదాపు 45 శాతం మంది నిల్వ ఉంచిన ఆహారపదార్ధాలనే తింటున్నారట.

  • Loading...

More Telugu News