: గే.. లెస్బియన్ సైట్లకు పాక్ చెక్


గే, లెస్బియన్, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ లకు చెందిన ఏకైక వెబ్ సైట్ ను పాకిస్థాన్ నిషేధించింది. ఇంటర్నెట్ వినియోగదారుల ఫిర్యాదు మేరకు పాకిస్తాన్ టెలికాం అధికారులు సదరు వెబ్ సైట్ ను తొలగించారు. అత్యధికంగా ఫిర్యాదులు రావడంతో వినియోగదారులకు అందుబాటులోకి రాకుండా ఈ సైట్ ను తొలగించామని అధికారులు తెలిపారు. అయితే 'గే కమ్యూనిటీని ఆదరించండి' అంటూ ప్రారంభించిన వెబ్ సైట్ ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. స్వలింగ సంపర్కం పాక్ చట్టవిరుద్దం కావడానికి తోడు ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉన్న ఈ కేసును వాదించడానికి కూడా లాయర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఇలాంటి వెబ్ సైట్ ను నిర్వహిచండం సర్వసాధారణం కానప్పటికీ, తాము అనేక జాగ్రత్తులు తీసుకుంటున్నామని వారు స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News